కలిసుందామని విన్నపాలు -- కాజేద్దామని మన పాలు
నదీ నాదాల దారులు మనవి -- నదీ జలాల దారలు వాళ్ళవి
తెలంగాణా ప్రాంతపు పల్లెలు --ఆంధ్ర పాలకుల ముల్లెలు
సమైక్య రాష్త్రం తో దగా -- లేకుండా పోయింది జాగా
మాటల్లో మనమంతా అన్నదమ్ములు -- చేతల్లో చూషంగా వున్న దమ్ములు
విశాలాంధ్ర ఏర్పాటు బలవంతం -- విడదీసి చేద్దాం ఫలవంతం
మా భూములు చిన్నబోయాయి తడారి -- చూస్తూనే పోతే త్వరలోనే మరో ఎడారి
అందర్నీ సమానం చేస్తామని ఒట్టు -- ఎక్కించారు ఇంతకాలం మునగచెట్టు
చేయాలన్డుంట ప్రజలుకు సేవ -- ఎవరికీ తెలియదులే అధికార యావ
ఆంధ్రుల ఇంట పన్నీరు -- తెలంగాణా కంట కన్నీరు
రామేశ్వరం పోయిన శనేశ్వరం పోలేదన్నట్లు -- గొర్రెలు తినేవాడు పోయి బర్రెలు తినేవాడు వచ్చిండు
ప్రభుత్వ కళాశాలలు మనవితే -- విద్యార్ధులు వారు
విశ్వ విద్యాలయాలు మనవితే -- వైస్ చాన్సులర్లు వారు
ప్రభుత్వ ఆస్పత్రులు మనవైతే -- డాక్టర్లు వాళ్ళు
కోర్టులు మనవైతే -- జడ్జీలు వాళ్ళు
నల్గొండ లో కట కట త్రాగు నీరు -- పాలమూరులో పత్తా లేదు సాగు నీరు
ప్రైవేటు కళాశాలు వాల్లవైతే -- విద్యార్ధులు మనం
ప్రైవేటు ఆస్పత్ర్హులు వాల్లవైతే-- రోగులు మనం
పరిశ్రమలు వాల్లవైతే -- కాలుష్యం మనకి
కాన్త్రంక్టర్లు వాళ్ళైతే -- కూలీలు మనం
ఎత్తుక పోవడాలు వారివైతే -- ఎత్తిపోతలు మనకు
ఉద్యోగులు వారైతే -- నిరుద్యోగులు మనం
భవనాలు వారివైతే -- పూరి గుడిసెలు మనవి
గుర్రం పరుగు మనకైతే -- జాక్పాట్ వారికి
భాష ఒక్కటే కానీ -- యాస వేరు
జాతి ఒక్కటే కానీ -- నీతి వేరు
ప్రజలోక్కటే కానీ -- పాలకులు వేరు
చాడువులోక్కటే కానీ -- కొలువులు వేరు
భూములోక్కట్ e కానీ -- ధరలు వేరు
నడులోక్కటే కానీ -- పారేతీరు వేరు
రాష్త్రం ఒక్కటే కానీ -- కస్తాలు వేరు
ఆంధ్రులకు నిర్ణయాధికారం -- తెలంగాణకు బానిసత్వం
కలిసుండాలని రెండు ప్రాంతాల పొత్తులు -- పాలకులంతా ఒకే ప్రాంతానికి తొత్తులు
నా(టి) తెలంగాణ కోటి రత్నాల వీణ -- నేటి తెలంగాణ కన్నీటి తంత్రుల వీణ... ఏ తంత్రిని మీటినా కన్నీటి దారలే
Tuesday, December 1, 2009
Subscribe to:
Post Comments (Atom)
కాన్త్రంక్టర్లు వాళ్ళైతే -- కూలీలు మనం
ReplyDeleteవార్నీ..దొరికిందా కదా రాయడానికి అని ఏది కావాలంటే అది రాయడమేనా..? వై.యస్. గారి హయాం లోనే మా కడప జిల్లాలో కె.సి కెనాల్ ( క్రిష్ణ కాలువ ) పనులు మహబూబ్ నగర్, మెదక్, వరంగల్ జిల్లాల వారు కొన్ని వందల ట్రక్కులతో, పదుల సంఖ్యలో బుల్ డోజర్స్ తో వచ్చి మూడు సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ పనులు చేసుకున్నారు, మరి ఇక్కడ కూలి వారు ఎవరూ..? కడప వాళ్ళు కూలి వారు..! ఇలా వాస్తవాలు తెలుసుకోకుండా ఊరికే రెచ్చగొట్టే విదంగా రాయడం తప్ప మీకు ఇంకే పనిఉన్నట్లేదు..! లేక ఇలా రాయడం వెనుక మీ ఇంకో తెలివి దాగి ఉన్నదా..? వెనుకబడి ఉన్నాము అనో లేక ఇంకొకరి తెలివి వలన మోసపోయాము అనో అన్న మాటలు చెబుతూ అందరిని నమ్మిస్తూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం పొందాలన్న దురాశ ఉందేమో అనిపిస్తున్నది.
matalu cheppi namminchalsina avasaram telangana prajalaki ledhu. aina thu ani moham medha ummesthu... metho kalisundam ani antunte inka kalisundhamane vallani emanalo . . ?
ReplyDelete