Monday, December 14, 2009

నిజం నిప్పులాంటిది..

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామంటూ భారత ప్రభుత్వం ప్రకటించిన క్షణం నుంచి రాష్ట్రంలో వాదోపవాదాలు బాగానే జరుగుతున్నాయి. తెలంగాణ ఎలా ఇస్తారంటూ ఆంధ్ర, రాయలసీమ నాయకులు రాజీనామాల రాజకీయానికి క్షణాల్లో తెరతీశారు.. ఆయా ప్రాంతాల ప్రజలూ భావోద్వేగంతో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.. పొట్టిశ్రీరాములు అమర త్యాగంతో సాధించుకున్న రాషా్టన్న్రి ముక్కలు చేయవద్దని ఒకరు.. పెద్ద రాష్ట్రంగా ఉండకుండా చీల్చేందుకు చిదంబరం కుట్ర చేశారని మరి కొందరు.... కేవలం పదకొండు రోజులు నిరాహార దీక్ష చేస్తేనే తెలంగాణ ఇస్తారా అని విమర్శించే వారు ఇంకొందరు.. ఎందుకో తెలియదు కానీ,సమైక్యంగా ఉంటే చాలని ఇంకా కొందరు..... ఎవరికి తోచిన రీతిలో, ఎవరి మనసుకు ఎలా అనిపిస్తే అలా వారి వారి అభిప్రాయాలు చెప్తున్నారు.. తెలంగాణ ఎందుకు ఇవ్వాలో.. ఎందుకు ఇవ్వకూడదో ఇప్పటికైనా ముందుకు వచ్చి చర్చ చేస్తున్నందుకు సంతోషం... ఇది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం.. ఈ విస్తృత చర్చ వల్ల ఆరు దశాబ్దాల సమస్యకు, ఉద్యమాలకు, ఉద్వేగాలకు పరిష్కారం లభిస్తే అంతకంటే కావలసిందేముంటుంది? పరిష్కారం లభించకుండా సద్దుమణిగితే, నివురు గప్పితే... నిప్పు ఎప్పుడైనా ఎగిసే ప్రమాదం ఉంటుంది.. భావోద్వేగాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, స్వార్థ ప్రయోజనాలకు దూరంగా, సంస్కారవంతమైన రీతిలో, అందరికీ గౌరవాన్ని కలిగించే విధంగా, మర్యాదలను అతిక్రమించకుండా ఒక అన్ని ప్రాంతాల ప్రజల సుఖ సంతోషాలకు అనుకూలంగా పరిష్కారాన్ని సూచించగలిగితే ప్రజలు సుభిక్షంగా ఉంటారు....మనకు కావలసింది నేతలు సుభిక్షంగా ఉండటం కాదు.. వారి వ్యాపారాలు సుసంపన్నం కావటం కాదు.. రియల్‌ వ్యాపారులు సమృద్ధిగా ఉండటం కాదు.. సామాన్య ప్రజలు ఉద్యోగాలు, ఉపాధి కల్పనలు, వనరుల వినియోగం, మనోభావాల పరిరక్షణ, భాష, యాస, పండుగ, పబ్బం, సంస్కృతి, నాగరికత, జాతీయతల పట్ల పరస్పర గౌరవ మర్యాదలతో, మన్ననలతో సుఖంగా, సంతోషంగా కలిసి మెలిసి ఉండేందుకు అవసరమైన పరిష్కారం సూచించగలగాలి... అన్ని ప్రాంతాల్లో ఎంతోమంది పెద్దలు ఉన్నారు. విజ్ఞులున్నారు... సావకాశంగా ఆలోచించండి.. సావధానంగా అవలోకించండి... ఆత్మను చంపుకోకుండా, నిజాయితీతో మనందరి క్షేమాన్ని, సంక్షేమాన్ని, సౌభ్రాతృతను దృష్టిలో ఉంచుకుని పరిష్కారాన్ని ఆలోచించండి...ప్రభుత్వానికి సూచించండి...

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలన్న డిమాండ్‌ వెనుక ఉన్న తెలంగాణ ప్రాంతం వాళు్ల అనేక కారణాలు చెప్తున్నారు.. అందులో న్యాయం ఎంత ఉంది, ఎంత లేదు అన్న మీమాంస పక్కనపెడితే, సమైక్యత కోరే వాళు్ల ఎందుకు కోరుకుంటున్నారో కారణాలు చెప్పటంలో కొంత ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తున్నది. కేవలం సమైక్యత కావాలని అనటం మినహా ఎందుకో సహేతుకంగా వివరించటం విడిపోవాలని కోరుకుంటున్నవారికి ఆ విషయం తెలియజేయటం అవసరం... తప్పనిసరిగా విడిపోవాలని బలంగా కోరుకుంటున్న వారితో కలిసి ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారో చెప్పటం బాధ్యత... అది కనీస కర్తవ్యం...
సమైక్య త కోరుకుంటున్న సోదరులు హైదరాబాద్‌ మినహా ఏ వరంగల్‌ గురించో, కరీంనగర్‌ గురించో, నిజామాబాద్‌ కానీ, మహబూబ్‌ నగర్‌ కానీ, ఖమ్మం కానీ, ఆదిలాబాద్‌ కానీ, మెదక్‌ కానీ రంగారెడ్డి కానీ, నల్గొండ జిల్లాల గురించి మాట్లాడటం లేదు. కేవలం హైదరాబాద్‌ గురించి మాత్రమే గొంతెత్తి, ఎలుగెత్తి నినదిస్తున్నారు.. సమైక్యం అంటే హైదరాబాద్‌ మాత్రమేనా? హైదరాబాద్‌ను తెలంగాణ నుంచి విడదీస్తే తెలంగాణ ఇవ్వటానికి వీరికి ఎలాంటి అభ్యంతరం లేదా? హైదరాబాద్‌ను తెలంగాణ నుంచి విడగొడితే ఈ ఆందోళనలన్నీ సద్దుమణుగుతాయా? సమైక్యం అంటే ఇదేనా? మిగతా జిల్లాలు పరిగణలోకి వస్తాయా? రావా?
తెలుగు వారు అందరూ ఒకటే అన్నది రెండో నినాదం... ఇందులో సందేహం ఉండక్కర్లేదు.. కానీ, ప్రస్తుత రాష్ట్రంలో తెలుగు, ఆంధ్రము వేరు వేరుగా చూడబడుతున్న మాట ఎంతవరకు వాస్తవం..? తెలుగు వారి సంస్కృతి, ఆంధ్ర సంస్కృతితో భిన్నం చేసి చూపించటం, చిన్నచూపు చూడటం వాస్తవంగా ఎక్కడా జరగటం లేదా? ఆంధ్రమే అసలు తెలుగుగా, తెలంగాణలోని తెలుగు అసలు భాషే కానట్లుగా, తెలంగాణ ప్రజలు వేలిముద్రగాళ్లని, వారికి అక్షరాభ్యాసం చేసి, నాగరికత నేర్పించింది ఆంధ్రులేనన్న ప్రచారంలోని వాస్తవాస్తవాలు ఎన్ని? తెలంగాణ ప్రజలకు అభివృద్ధి అంటే ఏమీ తెలియదనీ, నిజాం పాలనలో వారు దారుణంగా వెనుకబడిపోయారని, ఆంగ్లేయుల ధర్మరాజ్యంలో తాము నాగరికంగా ఎంతో అభివృద్ధి చెందామని, అలా వెనుకబడిపోయిన తెలంగాణ ప్రజలను, ఆంగ్లేయుల ధర్మ పరిపాలనలో ఉద్ధరింపబడిన తాము ఉద్దరించినట్లు, ఇప్పటికీ ఉద్ధరిస్తున్నట్లు చేస్తున్న ప్రచారంలో నిజానిజాలేమిటి?
సమైక్యత అంటే కలిసిమెలిసి ఉండటం అన్నది స్థూలంగా చెప్పుతున్న అర్థం... అన్ని ప్రాంతాల ప్రజలు ఒక కుటుంబంగా కలిసిమెలిసి ఉండటం వాంఛనీయమే. తెలుగు భాష మాట్లాడే వారందరినీ ఒక జాతిగా భావిస్తే, ఆ ప్రజలంతా కలిసి మెలిసి ఉండటం అంటే, పరస్పర మనోభావాలను గౌరవించుకోవటం జరగాలి. ఒకరితో మరొకరు మమేకం కావాలి. పండుగల్లో, పర్వదినాల్లో పరస్పరం కలగలిసిపోవాలి.. సంబరాలు చేసుకోవాలి.. సౌభ్రాతృత్వంతో మెలగాలి. భాషలోని యాసను గౌరవించాలి. అందులోని తీయదనాన్ని ఆస్వాదించాలి. మర్యాదల్ని పాటించాలి.. విడిగా ఉన్న రెండు రాషా్టల్రను ఒక్కరాష్ట్రంగా కలిపి యాభై సంవత్సరాలు దాటింది. ఈ యాభై ఏళ్లలో ఏ ఒక్కనాడైనా తెలంగాణ ప్రజలతో పైన పేర్కొన్న ఏ ఒక్క సందర్భంలోనైనా ఇతర ప్రాంతాల ప్రజలు మమేకం అయిన ఉదాహరణలు ఉన్నాయా? గౌరవించనక్కర లేదు.. పండుగలు జరుపుకోనక్కర్లేదు.. కనీసం కించపరచకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయా? నీచంగా చూడకుండా ఉన్న సందర్భం ఉందా? రెండు రాషా్టల్రు ఒక్క రాష్ట్రంగా మారిందే తప్ప... రెండు జాతులు ఒక్క జాతిగా మారినట్లు దాఖలా ఉందా?
కొంత కాలంగా పరస్పర ప్రాంతాలకు అతీతంగా వివాహాలు జరుగుతున్న మాట నిజం. కానీ, ఇక్కడ ఉన్న తిరకాసు మరొకటి ఉంది. తెలంగాణ అబ్బాయి ఆంధ్ర అమ్మాయిని వివాహం చేసుకుంటే, అబ్బాయి ఆంధ్రా వైపు మొగ్గుతాడు.. తెలంగాణ అమ్మాయి ఆంధ్ర అబ్బాయిని చేసుకుంటే అటోమెటిక్‌గా మారిపోతుంది.. ఇదెలా ఉంటుందంటే మీ ఇంటికి వస్తే మాక్కావలసింది పెట్టండి.. మా ఇంటికి వస్తే మా కోసం తీసుకురండి.. అన్నట్లుగా ఉంటుంది. ఒక విధంగా బలవంతపు మతమార్పిళ్లలాగే తప్ప రెండు ప్రాంతాల మధ్య ఐక్యత సాధించటానికో, రెండు ప్రాంతాల కుటుంబాల మధ్య ఏకతా సూత్రాన్ని నిర్మించటానికో.. రెండు సమాజాలను ఒకదానిలో ఒకటి విలీనం చేయటానికో ఈ వివాహాలు ఉపయోగపడిన సందర్భాలు లేవు. ఈ రకమైన ధోరణిని ఎలా స్వీకరించాలి?
సామాజిక, సాంస్కృతిక జనజీవన విధానంలో ఈ రెండు జాతులూ ఏనాడూ ఒకటిగా లేవు.. ఒక రాష్ట్రంగా మారిన తరువాత కూడా ఒకటి కావటంలో పూర్తిగా విఫలమయ్యాయి. విభేదాలు పెరుగుతూ వచ్చాయి. వీరిని ఒకటి చేసేందుకు ఎవరూ ప్రయత్నించలేదు.. ప్రజల్లోనూ ఏకాత్మ భావన పెంపొందలేదు. ఇంతకాలంగా ఎవరికి వారుగానే ఉండిపోయారు.. ఇక ముందు కూడా ఎవరికి వారుగానే ఉండిపోతారు.. ఇలాంటి రెండు విభిన్నమైన జాతులను ఒకటిగా కలిపి బలవంతంగా ఉంచటం సాధ్యమేనా? ఇప్పుడు ఆందోళనలతోనో, మరో ఒత్తిడి రాజకీయాలతోనో విడిపోవటాన్ని జాప్యం చేయించవచ్చేమో...శాశ్వతంగా ఎంతకాలం కలిసి ఉండేలా చేయగలరు? తెలంగాణ వారిని ఏకపక్షంగా నిందించటం వల్లనో, ఆంధ్రప్రాంతం వారిని నిందించటం వల్లనో కలిసి ఉండటం సాధ్యమా?
సమైక్యం కావాలని కోరుకుంటున్నామంటున్న నాయకగణం చెప్తున్న వాదన ఒకటి ఉంది. రాష్ట్రంలోని ప్రజలంతా సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను కోరుకుంటున్నారని.. నిజంగా అలా కోరుకుంటే ఇంత గందరగోళం దేనికి? కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అనే ఒక దుర్మార్గుడైన వేర్పాటు వాది కారణంగానే అల్లకల్లోలం జరుగుతోందని వారి వాదన. అదే నిజం అని కాసేపనుకుందాం.. రాష్ట్రంలో 23 జిల్లాలు ఉన్నాయి. అందులో పది జిల్లాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. తెలంగాణ కావాలన్న డిమాండ్‌ కూడా ఈ పది జిల్లాల్లో పదకొండు రోజుల పాటు ప్రతిధ్వనించింది. ఈ పదకొండు రోజుల్లో ఈ పది జిల్లాలు మినహా మరే జిల్లాలో ఒక్క క్షణం పాటైనా సమైక్య నినాదం వినిపించలేదు.. కెసిఆర్‌ చేస్తున్నది తప్పు.. తెలంగాణ ప్రజలు కోరుతున్నది తప్పు.. సమైక్య రాష్టమ్రే కావాలని ఏ ఒక్క చోటా ఒక్క పౌరుడు కూడా పల్లెత్తు మాట మాట్లాడలేదు. తెలంగాణలో జరుగుతున్న ఆందోళనలను టివీల్లో చూస్తూ కూచున్నారు.. (చూసి ఉండకపోవచ్చు కూడా.. ఎందుకంటే వారికి గుడ్డి నమ్మకం తెలంగాణ ఇచ్చే సాహసాన్ని సోనియమ్మ చేయదని)...అదే నమ్మకంతో సోనియమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా శిరోధార్యమంటూ ఆ పార్టీ నేతలు, పక్క పార్టీ నేతలు ప్రకటనల మీద ప్రకటనలు గుప్పించారు.. తీరా చిదంబరం దొర చిట్టా విప్పి తెలంగాణకు పచ్చజెండా ఊపటంతోనే అందరి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఏం చేయాలో తోచలేదు. అమ్మని ధిక్కరించలేరు.. కాదని మనలేరు.. ఔనని ఊరుకోలేరు.. అందుకే ఒత్తిడి రాజకీయాలు మొదలయ్యాయి. ఇందులో వారి తప్పేమీ లేదు. ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారివి. అది తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, కోస్తా అయినా, సీమ అయినా, ఉత్తరాంధ్ర అయినా మినహాయింపు లేదు. సమైక్య వాదుల నినాదం ప్రకారం విడిపోవాలని గొడవ చేస్తున్నది కెసిఆర్‌. పదకొండు రోజుల ఉద్యమాన్ని స్పాన్సర్‌ చేసి నడిపించింది కెసిఆర్‌. ఈ వాదనల ప్రకారం తెలంగాణ ప్రజలకు కూడా తెలంగాణ కావాలని లేదన్నమాట.. అలాంటప్పుడు చిదంబరం ప్రకటన రాగానే నిరసన వ్యక్తం చేయాల్సింది నిజంగా ఎవరు? తెలంగాణ ప్రజలు.. మేము మా ఆంధ్ర సోదరులతోనే కలిసి ఉంటాం.. విడిపొమ్మనటానికి కెసిఆర్‌ ఎవరు? మమ్మల్ని అన్యాయం చేయకండి అని గొడవ చేయాల్సింది తెలంగాణ ప్రజలు... మరి పది జిల్లాల్లో ఒక్క చోట కూడా ఈ నినాదం వినిపించలేదు. సమైక్యం కోసం ఆందోళన జరగలేదు. పైగా సంబరాలు చేసుకున్నారు.. దీని అర్థం ఏమిటి? ఉద్యమాన్ని కెసిఆర్‌ స్పాన్సర్‌ చేస్తే.. తాము అన్యాయంగా విడిపోతామన్న ఆందోళన తెలంగాణ ప్రజల్లో ఉంటే స్పాంటేనియస్‌గా తెలంగాణ ప్రజల్లో నిరసన వ్యక్తం కావాలి కదా? ఎందుకు కాలేదు.. ఈ మాత్రం ఆలోచన వారిలో వచ్చేలాగా గత యాభై ఏళ్లలో ఆంధ్రప్రాంత ప్రజలు వారిని విద్యావంతులను చేయటంలో సక్సెస్‌ కాలేకపోయారా?
తెలంగాణ వస్తే ఆంధ్రప్రాంత ప్రజలకు భద్రత ఉండదనే భయం ఉందని జెసి దివాకర్‌ రెడ్డి జీ 24 గంటలుతో అన్నారు.. ఆయన అన్నట్లు అభద్రతాభావం నిజంగా ఉంటే, తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రాంత ప్రజలైనా ఆందోళన చేయాలి కదా? వాస్తవంగా అభద్రతాభావం ఉన్నదెవరికి? వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటాయన్న ఆందోళన ఉన్నదెవరికి?
ఇక సమైక్యవాదులు చెప్పే మరో ప్రముఖమైన మాట హైదరాబాద్‌ నగరాన్ని వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి మేం అభివృద్ధి చేశామని.. అవన్నీ తీసుకుని పోతే హైదరాబాద్‌లో రాళూ్ల రప్పలూ తప్ప మిగిలేది ఏమీ లేదని....సంతోషమే. హైదరాబాద్‌ను ఆంధ్రప్రాంత ప్రజలు ఎంత అభివృద్ధి చేశారో చెప్తే సంతోషమే... కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌ వంటి ప్రాంతాల్లో కొత్త కాలనీలు వెలసి నగరం విస్తరించింది. ఇళు్ల కట్టుకున్నారు.. అపార్‌‌టమెంట్లు వెలిశాయి. రియల్టర్ల వ్యాపారం పెరిగింది. ఇవి కాకుండా సినిమా పరిశ్రమ రావటం వల్ల జూబ్లీహిల్‌‌స, బంజారాహిల్‌‌స వంటి ప్రాంతాలు డబ్బున్నోళ్ల వీధులుగా మారిపోయాయి. ఇవి కాకుండా హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి ఏమిటి? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి... రోడ్లు విస్తరించటం, ఫై్ల ఓవర్లు కట్టడం అభివృద్ధిలో భాగమే.. రాషా్టన్రికి రాజధానిగా ఉన్న నగరం విస్తరిస్తున్న క్రమంలో ప్రజలకు రహదారి సౌకర్యం కల్పించటం ప్రభుత్వాల బాధ్యత.. అది హైదరాబాదైనా, మరో నగరమైనా ఒకటే. భారత దేశానికి ప్రధానమైన సైనిక బేస్‌ హైదరాబాద్‌లో ఉంది. హైదరాబాద్‌ ఏ రాష్ట్రంలో ఉన్నదన్న దానితో నిమిత్తం లేకుండా సైనిక అవసరాలకోసం ఉపయోగపడుతున్న నగరంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనివార్యంగానే వస్తాయి. ఇందులో ఆంధ్ర ప్రాంతవాసుల పెట్టుబడులు ఉన్నాయనుకోం..హైదరాబాద్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నిజాం కాలం నాటిది... ఉస్మానియా మెడికల్‌ కాలేజీ, వుమెన్‌‌సకాలేజీ, హైకోర్టు, రాజ్‌భవన్‌, అసెంబ్లీ, దిల్‌కుశ్‌ గెస్‌‌టహౌస్‌, పురానాపూల్‌, నయాపూల్‌, మక్కామసీదు, హుస్సేన్‌సాగర్‌, హిమాయత్‌ సాగర్‌, నగరంలో ప్రస్తుతం ఉన్న అండర్‌ డ్రైనేజీ వ్యవస్థ, ఆబిడ్‌‌స, కోఠీ వంటి వాణిజ్య ప్రాంతాలు, నాంపల్లి, సికిందరాబాద్‌, కాచీగూడ రైల్వే స్టేషన్లు, బేగంపేట విమానాశ్రయం, సనత్‌నగర్‌ పారిశ్రామిక వాడ ఇవన్నీ కూడా నిజాం కాలం నుంచీ ఉన్నవే... ఇప్పటి ప్రభుత్వాలు కానీ, లగడపాటి రాజగోపాల్‌ వంటి తెలుగువారందరి మేలు కోరుతున్నాననే మహా గొప్ప పారిశ్రామిక వేత్త కానీ పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేసినవి కావు. ఫై్ల ఓవర్లు మినహా ప్రస్తుత ప్రభుత్వాలు హైదరాబాద్‌లో ప్రజలకు కల్పించిన మౌలిక సదుపాయాలు మచ్చుకు కూడా కనిపించవు. మరి ఆంధ్రప్రాంత పెట్టుబడులు ఎక్కడ ఉన్నాయి? అసలు ఉన్నవి పెట్టుబడులా? వ్యాపారమా? వ్యాపార ప్రయోజనం ఎక్కడ ఉన్నా నెరవేర్చుకోవచ్చు. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇందులో ఎవరికైనా ఇబ్బంది ఉండాల్సిన అవసరం దేనికి? ఈ ప్రయోజనాలు దెబ్బ తింటాయంటూ ఒక ప్రాంత ప్రజలను, ఒక జాతిని కించపరచటం, మనోభావాలను దెబ్బతీయటం అవసరమా?
ఇప్పుడు తెలంగాణలో ఒక ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రాంత ప్రజలు తమ వనరులపై తాము సొంతగా జీవించలేరని, ఇతరుల వనరులపైనే ఆధారపడి జీవించటానికి వాళు్ల అలవాటు పడిపోయారని... ఇతరుల ఆదాయంపైనే ఆధారపడ్డారని.. ఇది ఎంతవరకు వాస్తవం? వాళ్లకు వనరులు లేవా? బందరు పోర్టు ఉంది. కాకినాడ గ్యాస్‌ ఉంది.. బాకై్సట్‌ నిక్షేపాలు ఉన్నాయి. గన్నవరం ఎయిర్‌పోర్‌‌ట ఉంది. సువిశాల సముద్రతీరం ఉంది. సుసంపన్నమైన వ్యవసాయం ఉంది. రేపు ఆంధ్ర రాష్ట్రం అంటూ ఏర్పడితే అక్కడ రాజధాని వస్తే, ప్రభుత్వ శాఖలు ప్రత్యేకంగా ఏర్పడితే లక్షమందికి పైగా ఆంధ్ర ప్రాంత ప్రజలకు ఉపాధి కలగవచ్చు. వీటన్నింటినీ ఆధారం చేసుకుని స్వయం సమృద్ధి సాధించటం వారికి సాధ్యం కాదా? మేము మీతో ఉండము మొర్రో.. మీ దారిన మీరు వెళ్లండి బాబూ.. మీ డబ్బులు, మీ వనరులు మాకేం వద్దు.. మా వాటా మా కిచ్చి వెళ్లి పొండని ఇంతగా చీత్కరించుకుంటున్నా చూరు పట్టుకుని వేళ్లాడుతున్నారన్న ఆరోపణల్లో వాస్తవం ఏమిటి?(ఆంధ్రజ్యోతిలో వస్తున్న వ్యాసాలు చూడవచ్చు.)మరి వద్దు పొమ్మంటున్నా మేముంటామంటూ ఆంధ్రప్రాంత ప్రజలు ఇంత బేలగా అయిపోయారన్న తెలంగాణ సంఘాల వాదన నిజమేనా? నిజమే అయితే ఎందుకింత బేలతనం..? అది కవిత రాసిన కాలం నుంచి మహామహులు ఉద్భవించిన ఆంధ్ర తేజస్సు తన అస్తిత్వాన్ని ఎందుకు కోల్పోతుంది? విజ్ఞులే సమాధానం చెప్పాలి.
సమైక్య రాష్ట్రంవిడిపోవటం వల్ల ఆంధ్ర సీమ ప్రాంతాలకు జరిగే నష్టాలేమిటి? అన్నది ఇదమిత్థంగా తేలాలి. నీటి వనరుల సమస్యే అయితే ఆ సమస్య పరిష్కరించటానికి ట్రిబ్యునల్‌ ఎలాగూ ఉంటుంది. ఎవరి వాటా ఏమిటన్నది అదే తేలుస్తుంది. అసలు అది సమస్యే కాదు.. మిగతా సమస్యలేవైనా రాష్ట్రం ఏర్పాటుకు ముందే విధి విధానాలు రూపొందుతాయి. సమస్యలన్నీ అప్పుడే పరిష్కారమవుతాయి. ఇక చిన్న రాషా్టల్ర వల్ల పరిపాలన సవ్యంగా సాగదంటే అది భ్రమే. పరిపాలించే రాష్ట్రం చిన్నదా? పెద్దదా? దాని భౌగోళిక సరిహద్దులు ఏమిటి? అన్నది ప్రధానం కాదు.. పాలకులు ఎంత చక్కగా పరిపాలిస్తున్నారు అన్నది ముఖ్యం. పాలకులు సమర్థులైతే, ప్రజల పట్ల ప్రేమగలవారైతే రాష్ట్రం అభివృద్ధి ఎల్లలు దాటి ముందుకు పరిగెడుతుంది. అదీ ఒకజాతి వారిని ఆ జాతి వారే పరిపాలించే సౌలభ్యం ఉంటే అభివృద్ధి అసాధ్యం కాదు..మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఒక భాష మాట్లాడే రెండు జాతుల ప్రజలు.. ఈ రెండు జాతులను కలిపి ఉంచటం సాధ్యం కాదు.. గతంలోనూ ఇవి రెండు రెండు రాషా్టల్రుగానే ఉన్నాయి. ఇవాళ పొట్టి శ్రీరాములుగారి ఫోటోలు పెట్టుకుంటున్న మహాను భావులంతా గ్రహించాల్సింది ఆయన మద్రాసు నుంచి ఆంధ్రరాష్ట్రం విడిగాకావాలని కోరుకున్నారే కానీ, ఆంధ్రప్రదేశ్‌ను కాదన్నది గ్రహించాలి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ ప్రాంతం అందులో భాగంగా లేదన్నది గుర్తించాలి. ఆ తరువాత మూడేళ్లకు కానీ ఆంధ్ర గడుసు పిల్లవాడితో అమాయకురాలైన తెలంగాణాను ఇచ్చి పెళ్లి చేస్తున్నట్లు సాక్షాత్తూ నాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రకటించారు.. ఇష్టం వచ్చినప్పుడు విడిపోవచ్చని కూడా ఆయన భవిష్యత్తు చెప్పారు.. ఇప్పుడు జరుగుతున్నది అదే... సోనియా మాట వినకపోతే సరి... కనీసం తమ పార్టీకి మూలస్తంభాలలో ఒకరైన నెహ్రూ మాటలనైనా గౌరవిస్తే మంచిది కదా... ఆలోచించండి...


Source http://kovela.blogspot.com/2009/12/blog-post_14.html

5 comments:

  1. chaalaa chakkagaa vivarinchaaru. naa blaagu koodaa choodagalaru. http://saamaanyudu.wordpress.com/

    ReplyDelete
  2. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  3. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  4. genteyyandi .. andhra dopidi dongalani.. pampeyyandi... donga bhaktulanu ..

    ReplyDelete
  5. Correct meeru baagaraasaru.. Andhra need HYD not siddipeta. but Telagana also need HYD. telangana not in a position to accept telagana without HYD.

    ReplyDelete