Tuesday, December 1, 2009

పొట్టి శ్రీరాములు పేరు జెప్పినరు

పొట్టి శ్రీరాములు పేరు జెప్పినరు

విశాలాంధ్ర నేర్పాటు జేసినరు

ఇత్తుదెచ్చినరు పొత్తు గూడినరు

మిగులు నిధులను మింగివేసినరు

తమ ప్రాంతాలభివృదిజేసినరు

మంత్రి పదవులను కొట్టేసినరు

సచివాలయమును ఆక్రమించినరు

కొత్త, కొత్త చట్టాలు జేసినరు

ఉద్యోగాలను దొబ్బివేసినరు

లంచాలు గొట్టి కూడబెట్టినరు

అగ్గువకూ మన భూములు గొన్నరు

కంపెనీలను కట్టుకున్నరు

వాళ్ళ వాళ్ళకే ఇచ్చుకున్నరు

తమ పనివాళ్ళను తెచ్చుకున్నరు

తెలంగాణులకు తెడ్డుజూపినరు

జర్రున జారే రోడ్లు వేసినరు

తాగి తూగుటకు సారబోసినరు

తెలంగాణనే తెర్లు జేసినరు

మన ఆచారం మంటగలిపినరు

వాళ్ళవన్ని మనమీద రుద్దినరు

ప్రాజెక్టులను కట్టివేసినరు

పారేనదులను ఆపివేసినరు

సాగునీళ్ళనూ దోచుకున్నరు

మంచినీళ్ళనూ మలుపుకున్నరు

మినరల్‌ వాటర్‌ మనకు అమ్మినరు

విద్యాసంస్థలు పెట్టివేసినరు

కళాశాలలను కట్టేసినరు

విద్యను డబ్బుకు అమ్మివేసినరు

సీట్లనెన్నిటినో కొట్టేసినరు

మనలను బయటికి నెట్టేసినరు

ఆసుపత్రులను కట్టివేసినరు

ఫీజులనన్నీ పెంచివేసినరు

గద్దెనెక్కి అధికార్లు ఐనరు

నోట్లు పంచి మన ఓట్లు గుంజినరు

మన ఆరోగ్యం మంట్ల గలిపినరు

భవంతులెన్నో కట్టుకున్నరు

భాగ్యమంత మరి పోగుజేసినరు

ధన, ధాన్యాలతో తూగుతున్నరు

రాజభోగముల దేలుతున్నరు

3 comments:

  1. You are great in your way
    Even I am from west Godavari I will support you.
    But don’t neglect to realize the real problems for Telangaana lagging
    Rayalasima is not good and even some districts in Andhra are not good.
    Andhra people are not the reason for backward telangana
    It’s the responsibility of telangana people only
    Don’t try to cheat someone for your problems

    ReplyDelete
  2. we are not cheating you for our problem. the problems are because of rulers(from andhra and rayalaseema).

    is it correct that if some districts in Andhra, Rayalaseema are backward then state should be combined.

    ReplyDelete
  3. the problems are because of rulers(from andhra and rayalaseema).

    మరి ...! మర్రి చెన్నారెడ్డి, పి.వి నరసింహారావు, టి.అంజయ్య.. ఏమి చేసారు..తెలంగాణకి..? ఒక్క సారి ఆలోచించండి..వీల్లంతా ఎక్కడ నుండి వచ్చారు. మీరంటున్నా ఆంధ్ర ( సర్కారు ప్రాంతం ) లేక రాయలసీమ వారా..?

    ReplyDelete