హైటెక్ రాజ్యంలో
అన్ని పనులు అల్కగానే జరుగుతాయి
ఇప్పుడు మనుషుల ‘మాయం’ కూడ
హైటెక్ మాయనే
పెన్నుతో, పేపర్‌తో డాక్టర్‌తో,
పనిలేకుండానే పనైపోతుంది.
ఎఫ్.ఐ.ఆర్.లు, ఇన్‌వెస్టిగేషన్లు
పోస్టుమార్టంలు దండగ
మాయం చేసే మర్మం తెలిసినోడికి
వీటితో పనేంటి?
వాడికి కావలిసింది
ఆరడుగుల అనువైన జాగ
దానికి తోడు పలుగు, పార సుత
ఇప్పుడు తెలంగాణ భూమిలో
శవాలు నాటుతున్నారు
మొదటి దానికి మెదక్ జిల్లా వేదికయింది.
రేపు రామాయంపేట కావచ్చు
ఎల్లండి ఎనగుర్తి కావచ్చు
ఇక తెలంగాణ భూమిలో
మొక్కలు మొలువై
దుష్టులు నాటిని శవాలు మొలుస్తాయి
ఇవే రేపటి పునర్జీవాలు అవుతాయి.
అవి భూమిని బద్దలు చేసి
బయటపడి ఎదిరించి నిలుస్తాయి
Tuesday, December 1, 2009
Subscribe to:
Post Comments (Atom)
ఈసారి తెలంగాణ రాకపోతే ఇంకెప్పుడూ రాదు.... ఉప్పెనలా లేవండి... ఉత్తుంగ తరంగాలై కదలండి... తెలంగాణ అంతటా అంధ్ర బోర్డులు పీకి..తెలంగాణ అని బోర్డులు పెట్టండి...
ReplyDeleteజై తెలంగాణ...
అవు రామన్న..నువ్వు చెప్పింది సక్కగనె ఉన్నది... . ఇప్పుడెట్లన్న చేసి తేవాలె...
ReplyDeleteజయహో తెలంగాణ.. జయ జయ జయహో తెలంగాణ...
andhra mahilasabha --> Telangana mahila sabha
ReplyDeletepotti sree ramulu university --> komaram bheem
Durga bai desh mukh --> kanche iylemma
గట్లనే..ఆంధ్రబ్యాంక్, ఇప్పుడు తెలంగాణ బ్యాంక్..! హు మోకాల్లో ఉంది తెలివి..!.
ReplyDelete